ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు ప్రసాద్ లు అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మరలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభల సందర్భంగా రైతు సంఘం జెండాను ఆవిష్కరించి అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగి రెండు లక్షల రుణమాఫీ కానీ మిగిలిపోయిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో నేటి వరకు జమ కాలేదని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, రైతు సంఘం సహాయ కార్యదర్శి అన్నెం పాపిరెడ్డి, పోతురాజు రాజేశ్వరరావు, దంతాల శేషయ్య, కొండ కోటేశ్వరరావు, రామకృష్ణ, బత్తినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు……..

next post