కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోదాడ కార్పెంటర్ల యూనియన్ సంఘం అధ్యక్షులు రేవూరి సత్యనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని కార్పెంటర్ల సంఘ భవన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ధరలు తగ్గించి పనులు చేస్తుండడంతో స్థానికంగా ఉండే తాము తీవ్రంగా ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల కార్మికులు సంఘంలో సభ్యత్వం తీసుకొని సంఘం నిర్ణయించిన ధరలకు చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమన్నారు. అదేవిధంగా కార్మికులందరూ తప్పనిసరిగా కార్మిక శాఖలో తమ పేర్లను నమోదు చేసుకొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లేపల్లి శ్రీధర్ చారి, సమన్వయ కమిటీ చైర్మన్ అడ్లూరి అంజయ్య చారి, కార్యదర్శి నెల్లూరి భ్రమరాచారి, కోశాధికారి నాంచార్ల ఉపేంద్ర చారి, ఉపాధ్యక్షులు షేక్ అల్లాబక్షు, జూకంటి ఉపేంద్ర చారి, సతీష్, రాము చారి, యలమంద చారి, శ్రీనివాస చారి, గంటా చారి తదితరులు పాల్గొన్నారు…….