అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కోదాడ పట్టణంలో మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతబాబు మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా తమ జాతి వర్గీకరణ కోసం పోరాడుతున్నదని సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, కార్యదర్శి స్వామి, నియోజకవర్గ నాయకులు పిడమర్తి బాబురావు, కోదాడ పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని, వెంకటి, సోమపంగు శీను, కుడుముల కళ్యాణ్, చంటి,రాజా తదితరులు పాల్గొన్నారు……….
