Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ బిల్లును ఆమోదించడం పట్ల టి ఎమ్మార్పీఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు తెలిపారు. బుధవారం పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు లో గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసామని సాధించిన ఈ వర్గీకరణ జాతి కోసం అమరులైన అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి శాసనసభ సమావేశాల్లోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి వర్గీకరణకు బాటలు వేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ కావడానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ల సుందర్ బాబు, మాజీ కౌన్సిలర్ లలిత, కర్ల కాంతారావు, గంధం రంగయ్య, కలకొండ ఆదినారాయణ, కందుల శ్రీను, వంశీ,వేణు,హుస్సేన్, వెంకట్, రామారావు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు……..

 

Related posts

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

TNR NEWS

*భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం* *75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ*

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Harish Hs

పద్మశాలి ఐక్యవేదిక జిల్లా కమిటీ లో కోదాడ వాసుల నియామకం

Harish Hs