Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

త్రిపుర సుందరి కోనేరును స్వర్ణాంధ్ర పార్కుగా ఎంపిక చేసి అభివృద్ధి చేయాలి

  • సిటీ ఎమ్మెల్యే హామీ నెరవేర్చాలి

  • పౌరసంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో మోడల్ స్వర్ణాంధ్ర పార్కు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా కాకినాడ నగరంలో త్రిపుర సుందరి కోనేరు ఆవరణను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం నగర పాలక సంస్థను కోరింది. 1969లో పిండాల చెరువుగా వుండేదని 1999లో శ్రామిక పుష్కరిణిగా తీర్చిదిద్ది, మహశివుని భారీ విగ్రహం  వాకింగ్ ట్రాక్, గ్రీనరీ నిర్వహణ, విద్యుత్ స్థంభదీపాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణలో త్రిపుర సుందరి దేవస్థానం కార్పోరేషన్ పట్టించుకోక నిర్వీర్యంగా మారిందన్నారు. నలువైపులా త్రాగి పడేస్తున్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పూజా మాలిన్యం, ఎండు చెత్తలు చేర్చి అంటిస్తున్న దుస్థితి వుందన్నారు. గోపురం లైటు మినహా పూర్తి స్తాయిగా అంధకారంలో మ్రగుతున్నదన్నారు. గ్రీవెన్స్ పిర్యాదుతో  క్లీనింగ్  చేపట్టి, గ్రీన్ నిర్వహణ చేయలేద న్నారు. పూలమొక్కలు అమ్ముకోవడానికి ప్రవేశం కల్పించారు మినహా మొక్కలు నాటింలేదన్నారు. నలువైపులా అనారోగ్యకర కోనోకార్పస్ వృక్షాలు ఉన్నాయన్నారు. 2018లో హోమాలు నిర్వహించి 6 రాతి శిలా విగ్రహాలు ప్రతిష్ట చేసి అమంగళకరంగా వదిలేశారన్నారు. నైరుతి దిక్కు నాగ శివలింగం అపహరణకు గురయ్యిందని టూ టౌన్ లో, కలెక్టర్ గ్రీవెన్స్  పిర్యాదు నమోదయినప్పటికీ ప్రభుత్వ శాఖల నిర్వహణ వలన ఎవరి మీదా విచారణ జరగలేదన్నారు. అసాంఘికంగా తయారవుతున్న త్రిపుర సుందరి కోనేరును మోడల్ స్వర్ణాంధ్ర పార్కుగా ఎంపిక చేస్తే అభివృద్ధి చెందుతుందన్నారు. గత విజయ దశమి ప్రెస్ మీట్ లో పాత్రికేయులకు సమాధానంగా  త్రిపుర సుందరి ఆలయ కోనేరును ఆధ్యాత్మిక పార్కుగా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వర రావు (కొండబాబు) ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ… అమలు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఫౌంటెన్స్ ఏర్పాటుతో పార్కును రూపుదిద్దాలన్నారు.

సిటీ ఎమ్మెల్యే హామీ నెరవేర్చాలి

పౌరసంక్షేమ సంఘం డిమాండ్

Related posts

ఏపీకి దూసుకొస్తున్న ముప్పు.. రేపటి నుంచి వర్షాలు

TNR NEWS

కాకినాడ కార్పోరేషన్ ప్రగతి పట్టాలెక్కించేదెప్పుడు

Dr Suneelkumar Yandra

నల్లమల అడవుల్లో ప్రసిద్ధిచెందిన.. కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలి

Dr Suneelkumar Yandra

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్‌ సమావేశాలు..!

TNR NEWS

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

TNR NEWS

5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర