పిఠాపురం : గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్ లో డిఈ సంతోష్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఇరిగేషన్ డిఈ సంతోష్ కుమార్ తో పలు అంశాలపై చర్చించారు. ఏకే.మల్లవరం, ఎపి.మల్లవరం, కొమరగిరి నీటి సంఘం మెంబర్లు, రైతుల అర్జీలు స్వీకరించి, పరిష్కార దిశగా పనిచేస్తామని తెలిపారు. ఎవరికైనా సమస్యలు వుంటే గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ ఆఫీస్ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫోన్ 8328381842 నెంబర్ కి సంప్రదించాలని కోరారు.
