కోదాడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మహిళా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అని అలాగే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గంధం యాదగిరి,పెండం వెంకటేశ్వర్లు, షాబుద్దీన్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, మధార్, షఫీ , సుబ్బారావు, కోటిరెడ్డి స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

previous post