ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి పదకాలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా ధరఖాస్తూలను మళ్లీ చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంగళవారం గ్రామ, వార్డ్ సభలు నిర్వహించగ మొత్తం 475 గ్రామ పంచాయితీలు ఉండగా 142 గ్రామ సభలు, 05 మున్సిపాలిటీ పరిదిలోని 141 వార్డులలో 35 వార్డ్ సభలను అధికారులు నిర్వహించారు. గ్రామ సభలలో 357 మంది రైతు భరోసా కొరకు, 4593 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 4221 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 4418 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వార్డ్ సభలలో 50 మంది మంది రైతు భరోసా కొరకు, 07 గురు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 676మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 717 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 407 మంది రైతు భరోసా కొరకు, 4600 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు, 4897 మంది కొత్త రేషన్ కార్డుల కొరకు, 5135 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు ధరఖాస్తూ చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.
