తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని 29, 35 వ వార్డులలో రేషన్ డీలర్లు అశోక్,యోగానందం, రామ్మూర్తి దుకాణాలలో పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సన్న బియ్యం పేదలకు అందజేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ వంటి పులి రమా శ్రీనివాస్, తోట శ్రీను కాంపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు……