ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..గర్భిణు లు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాలలో ఇచ్చే పోషకాహారం విశిష్టతను తెలియజేస్తూ అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సమన్వయంతో ఆరోగ్య సేవలు అందించాలన్నారు. చిన్న పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఉమ్మనీరు సమస్య, పుట్టగానే శ్వాస ఆడక పోవడం, పోషకాహార లోపం, నిమోనియా తదితర సమస్యలతో మరణాలు సంభవిస్తుంటాయని వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ వినయ్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

previous post