Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్ర వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

ది కోదాడ లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్రా వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు లారీ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు కావడంతో మంగళవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో గల వారి నివాసానికి లారీ అసోసియేషన్ నాయకులు వెళ్లి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కు 1985 నుంచి నేటి వరకు గత 40 సంవత్సరాలుగా లారీ యజమానులు, రవాణారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అసోసియేషన్ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. వారి మృతి కోదాడ లారీ అసోసియేషన్ కు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తూనం కృష్ణ, అసోసియేషన్ సెక్రటరీ యలమందల నరసయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ, మాజీ అధ్యక్షులు కనగల నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులు ఆవుల రామారావు, మాజీ కార్యదర్శి విలాస కవి నరసరాజు, పెద్ది అంజయ్య, ఆల్తా హుస్సేన్, పెద్ది చంద్రమౌళి, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు……….

Related posts

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Harish Hs

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జులై 3న జరిగే కార్మిక, కర్షక జిల్లా సదస్సును* *జయప్రదం చేయండి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

సరిపడా యూరియా రైతులకు పంపిణీ చేయాలి    సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి

TNR NEWS

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

TNR NEWS

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs