Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ

హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దుని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని డివైఎఫ్ఐ యువజన సంఘంగా స్వాగతిస్తున్నామని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ అన్నారు ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తామని అన్నారు.

Related posts

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

పార్దివ రథాల సంఖ్యను పెంచాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS