Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి వకుళమాత

  • గణపతి పీఠంలో 80వ జపయజ్ఞ  నీరాజనం

 

కాకినాడ : వకుళమాత చేతుల మీదుగా పద్మావతి కళ్యాణం పొందిన వేంకటేశ్వర స్వామి మాతృప్రేమకు మార్గదర్శకంగా నిలిచిన పెన్నిధి స్వరూపమని గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ద్వాపర యుగంలో తనను పెంచిన యశోధకు  మరు జన్మలో వకుళ మాతగా తన కళ్యాణాన్ని జరిపించే భాగ్యాన్ని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిగా సార్థకం చేశారని తోమాలసేవలో మాతృమూర్తి సన్నిధిగా తులసిదళాల మాలతో  అత్యంత పవిత్రంగా అలంకరిస్తారని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవారి 80వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా  శ్రీవారితో  బాటుగా వకుళమాతకు పుష్పాభిషేకం జరిగింది. తిరుమల వెళ్ళిన వారు వకుళ మాత ఆలయాన్ని దర్శించి తరిస్తే జన్మ జన్మలకు తరగని మాతృప్రేమ సిద్దిస్తుంద న్నారు. వంద మంది మాతృ మూర్తులకు బటర్ మిల్క్ బాటిల్స్ పంపిణీ చేసారు. వరలక్ష్మి, సత్య, నూకరత్నం, ఆదిలక్ష్మి, అనంతలక్ష్మీ, రాఘవమ్మ, నూకాలమ్మ, సరస్వతి, మహేశ్వరి, వైష్ణవి, హరిక మున్నగు వారు శ్రీవారి భక్త భజన మండలి ఆధ్వర్యాన ఏడు వారాల ఏడు దీపాలతో ఆరాధన చేసిన వారికి తాంబూలాలు ప్రదానం చేసారు.

Related posts

హరీకిషన్ జ్ఞాపకార్థం వృద్ధులకు దుస్తుల పంపిణీ

TNR NEWS

5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

TNR NEWS

కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగస్టు 15 – పీఠాధిపతి డా ఉమర్ అలీషా

Dr Suneelkumar Yandra

మధ్యనిషేధ ఉద్యమ రూపకర్త దూబగుంట రోషమ్మ వర్ధంతి

Dr Suneelkumar Yandra