రైతులు రోడ్లపై ధాన్యము ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం ప్రమాదకరమని ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయవద్దని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు అన్నారు. కావున రైతులు గమనించి సహకరించాలి అన్నారు.గత సంవత్సరం యువకుడు ద్విచక్ర వాహనం పై రాత్రి సమయంలో చివ్వెంల నుండి వట్టిఖమ్మంపాహడ్ వైపు వెళుతుండగా రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం గమనించక ప్రమాదానికి గురై ఒకరు మరణించారు, తుంగతుర్తి పరిధిలో వెలుగుపల్లి స్టేజి వద్ద ఆరబోసిన ధాన్యం కప్పను గమనించక రాత్రి సమయంలో ద్విచక్ర వహనదారుడు ప్రమాదానికి గురై ఒకరు మరణించారు. సూర్యాపేట రూరల్ పరిధి బాలెంల వద్ద కూడా ఇలాంటి ప్రమాదానికి గురై వ్యక్తి చనిపోయారు అని ఎస్పి గారు గుర్తు చేశారు. కొన్ని ప్రమాదాల్లో వ్యక్తులు గాయాలపాలయ్యారు అన్నారు.ధాన్యం అరబోయడం వల్ల ప్రమాదాలు జరిగి ఎవ్వరూ ప్రాణాలు కోల్పోవద్దు అని కోరారు, కావున రైతులు గమనించి రోడ్లపై ధాన్యం. ఆరబోయవద్దు అని విజ్ఞప్తి చేశారు. పోలీసు సూచనలు పాటిస్తూ సహకరించాలి అన్నారు.పోలీసు అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

previous post
next post