కోదాడకు చెందిన యరమాది లక్ష్మి తులసి భగవద్గీత పారాయణ పరీక్షలో స్వర్ణ పతకాన్ని సాధించారు.
టైలరుగా తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికత మీద ఉన్న మక్కువతో భగవధ్గీత పారాయణం మొదలు పెట్టారు, అలా ప్రతి ఏటా మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే 18 అధ్యాయాలు 700 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేసి , శ్రీ సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా స్వర్ణ పతకం మరియు సర్టిఫికెట్ను అందుకున్నారు.