కోమరబండ గ్రామంలో నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నందు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. భాహిరంగంగా మద్యం తాగుతూ సామాన్యులను, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎస్పి గారు ఈ సందర్భంగా ఆకతాయిలను హెచ్చరించారు.
ప్రజలకు చట్టాలు, శిక్షలు వివరించడానికి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా పోలీసులు మీ ముందుకు వచ్చారు అన్నారు. ప్రజలకు నేరప్రవృత్తి దరి చేరకుండా, నేరాలకు పాల్పడకుండా చేయాలనే ఉద్దేశ్యంతో మీ ముందుకు వచ్చాము. తప్పులు చేసి సమాజంలో తల దించుకోవద్దు, అందరూ మంచిగా ఉండి సమాజంలో మంచి పేరుకోసం మంచి ప్రవర్తనతో ఉంటారు, ఎవరో ఒక్కరూ చెడు నడవడిక కలిగి ఉంటారు వీరి ఆలోచన శైలి భిన్నంగా ఉంటుంది విచక్షణ లేకుండా నేరాలకు పాల్పడతారు, కేసుల్లో చిక్కుకుని జైలు పాలౌతారు అన్నారు. ఇలాంటి వారితో సమాజంలో శాంతి భద్రతలకు ఆటంకం వస్తుంది అన్నారు. ఇలాంటి చెడు ప్రవర్తన కలిగిన వారిని చట్టపరిధిలోకి తెచ్చి మంచి పౌరులుగా మార్చుకోవాల్సిన బాధ్యత మన పై ఉన్నది. క్రమశిక్షణ కలిగి ఉండాలి. గ్రామంలో ప్రశాంత వాతవరణం ఉంటే భవిష్యత్తులో యువత మంచి మార్గంలో నడుస్తారు అన్నారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత ఉద్యోగులుగా, ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అన్నారు. ఏ చర్యలకు, ఏ నేరానికి ఎలాంటి శిక్షలు అనేది చట్టం రూపొందించారు, ఇప్పుడు చట్టాలు బలోపేతం చేయబడ్డాయి, నేరం చేస్తే జైలుకు వెళ్ళక తప్పదు అని ఎస్పి గారు హెచ్చరించారు. పోలీసు రికార్డ్స్ లో పేరు నమొడైతే ఎప్పటికీ ఆ పేరు పోదు, భవిష్యత్తులో సమస్యలు వస్తాయి అన్నారు.
స్వార్థంతో, అత్యాశతో చాలా మంది ఇతరులపై దాడులు చేస్తున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు. గ్రామంలో చాలా మంది మద్యం మత్తులో గ్రామ మహిళలను ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది మా దృష్టి తెచ్చారు, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, గ్రామం పై పోలీసు నిఘా ఉంచుతాం అన్నారు. గ్రామంలో cc కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి అన్నారు.
ప్రస్తుత సమాజంలో సాంకేతికత పాటు సైబర్ మోసాలు పెరిగినాయి, సైబర్ నేరగాళ్లు అత్యాశ చూపుతూ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తారు, కష్టం చేసుకున్న డబ్బులు దొంగిలిస్తారు అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. బహుమతులు వచ్చాయి, మంచి లోన్ అవకాశం ఉన్నది అంటే నమ్మవద్దు అన్నారు. పథకాల పేరిట వేలిముద్రలు కావాలంటూ సంప్రదిస్తారు ఇలాంటి వారిని నిర్ధారించుకోకుండా వివరాలు ఇవ్వవద్దు అన్నారు. మీ పిల్లలు, మీ వాళ్ళు కేసుల్లో చిక్కుకున్నారు అంటూ CIB, CID అంటూ ఫోన్ చేసి భయపెడతాడు డబ్బులు ఇస్తే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇలాంటివి నమ్మి డబ్బులు చెల్లించవద్దు అన్నారు. అపరిచితులు మీ వ్యక్తి గత వివరాలు ATM, PIN, OTP అడిగిన, బెదిరించిన, డబ్బులు అడిగినా ఇవ్వవద్దు అన్నారు. ATM సెంటర్ల వద్ద సమహం చేస్తాం అని మోసగాళ్ళు నకిలీ ATM కార్డు లు మార్పు చేసి డబ్బులు దోచుకుంటారు అన్నారు. ఎవ్వరూ అత్యాశకు పోయి నస్తపోవద్దు అన్నారు. మన గ్రామంలోకి గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రానివ్వద్దు అన్నారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు అన్నారు, మనం జాగ్రత్తగా లేకపోతే డ్రగ్స్ మత్తులో విచక్షణ లేకుండా నేరాలకు పాల్పడతారు అన్నారు. గంజాయి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు, ధాన్యం రోడ్లపై ఆరబోయవద్దు అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ రజిత రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణ రావు, ఎస్సై లు అనిల్ రెడ్డి, నవీన్, రాంబాబు సిబ్బంది ఉన్నారు.