ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు 5 ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కువ ధర 1600 రూపాయలు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని రైతు ఆవేదన చెందాడు. దీంతో తాను తీసుకువచ్చిన ధాన్యం రాశికి నిప్పు అంటించి తగలబెట్టాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్దే పడుకున్నానని.. కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు..