ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా
జ్యోతిబా పూలే ఆదర్శప్రాయుడని
మహిళా హక్కుల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని కృషి చేశారని తహసిల్దార్ ఆంజనేయులు అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ..భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అన్నారు. భార్య సావిత్రిబాయ్ కి చదువు చెప్పించి, ఆమెను తొలి మహిళా ఉపాద్యాయురాలిగా చేసిన ఘనత జ్యోతిరావు కు దక్కింది అన్నారు. స్త్రీ విద్య, సమాజిక న్యాయం కోసం ఫూలే దంపతులు ఎంతో కృషి చేశారన్నారు.ఆ మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని సూచించారు.