మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యమని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరి, శ్రీధర్ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ లు పేర్కొన్నారు. సోమవారం ఉమా శ్రీధర్ ల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద మండుటెండలో వెళ్లే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమం పుణ్యకార్యమని అభినందించారు. ఈ
కార్యక్రమం లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రాజశేఖర్, ఉపాధ్యక్షులు యాదా సుధాకర్,పత్తి నరేందర్, ట్రస్ట్ గౌరవ సలహాదారులు పందిరి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ పాండు , డోనర్ సభ్యులు డోగుపర్తి హైమ శ్రీనివాస్, గుడుగుంట్ల సాయి, కాళంగి వెంకటేశ్వర్లు, మహంకాలి సత్యనారాయణ, హుస్సేనేరావు, బండారు శ్రీనివాసరావు, బేలిదే భరత్ , ఇమ్మడి అనంత చక్రవర్తి, డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర, ఓరుగంటి స్వాతి, చిల్లంచర్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు……..