Tnrnews.in
తెలంగాణ

వేసవిలో దాహార్తిని తీర్చడం అభినందనీయం

మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యమని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరి, శ్రీధర్ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ లు పేర్కొన్నారు. సోమవారం ఉమా శ్రీధర్ ల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద మండుటెండలో వెళ్లే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమం పుణ్యకార్యమని అభినందించారు. ఈ 

కార్యక్రమం లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రాజశేఖర్, ఉపాధ్యక్షులు యాదా సుధాకర్,పత్తి నరేందర్, ట్రస్ట్ గౌరవ సలహాదారులు పందిరి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ పాండు , డోనర్ సభ్యులు డోగుపర్తి హైమ శ్రీనివాస్, గుడుగుంట్ల సాయి, కాళంగి వెంకటేశ్వర్లు, మహంకాలి సత్యనారాయణ, హుస్సేనేరావు, బండారు శ్రీనివాసరావు, బేలిదే భరత్ , ఇమ్మడి అనంత చక్రవర్తి, డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర, ఓరుగంటి స్వాతి, చిల్లంచర్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న 4గురు దొంగలు అరెస్ట్

Harish Hs

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS

వైకల్య ధ్రువీకరణ పత్రం పొండెందుకు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టానికి సవరణలు చేయాలనే గెజిట్ ను రద్దు చేయాలి వైకల్య శాతన్ని బట్టి కాకుండా వికలాంగులందరికి ఒకే యు డి ఐ డి కార్డు జారీచేయాలి  ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శు వీరబోయిన వెంకన్న

TNR NEWS

నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Harish Hs