దేశ ప్రజలందరికీ రాజ్యాధికారం హక్కు కల్పించిన దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మాదిగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కులాలు ,మతాలు, వర్గాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలందరికీ అందేలా రాజ్యాంగం రచించిన మహానేత అంబేద్కర్ అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన జరిగిందని ఇటీవల అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కేంద్రంలో పరిపాలన కొనసాగుతుందని తమ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎదుర్కొంటామన్నారు. అంబేద్కర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మంచి రాజ్యాంగం రాశారని ఆ రాజ్యాంగాన్ని పాటిస్తేనే ఆయనకు ఘనమైన నివాళులు అందుతాయి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ కుల గణన లకు కృషి చేశారని వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమానికి పార్టీలకతీతంగా ముందుకు వచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. కోదాడ అంబేద్కర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ కు నిధులు మంజూరు చేయాలని దళిత ఐక్యవేదిక నాయకులు కోరగా అంచనాలు వేయించి సిద్ధం చేస్తే వెంటనే మంజూరు చేస్తానన్నారు. మున్సిపాలిటీలో తొలగించిన కామాటీలను తిరిగి తీసుకునేందుకు రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మాట్లాడుతున్నారని త్వరలో తీసుకునేందుకు కృషి చేస్తానన్నారు. కోదాడలో బస్టాండ్ నిర్మాణానికి చిలుకూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆకుపాములలో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు కోదాడలో అండర్ డ్రైనేజీ సిస్టం నిర్మాణానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 450 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. సభాధ్యక్షులు చింత బాబు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, కంభంపాటి శ్రీను, గంధం యాదగిరి, కత్తి వెంకటేశ్వర్లు, చీమ శ్రీను, గంధం పాండు, పంది తిరపయ్య, గంధం బంగారు, నెమ్మది సురేష్, పిడమర్తి బాబురావు, ఎర్పుల చిన్ని, పారా సీతయ్య,వంటిపులి వెంకటేష్ కుడుముల లక్ష్మీనారాయణ, గాలి శ్రీనివాస్ నాయుడు, పైడిమరి సత్తిబాబు, ఓరుగంటి ప్రభాకర్, వంగవీటి శ్రీనివాస్,యలమర్తి రాము, కర్ల విజయరావు , ఏపూరి సత్యరాజు, సోమపంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు…………..

previous post
next post