పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ చర్చ్ లో షాలేమ్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సండేస్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా పాస్టర్ టి.కరుణ్ రాజు మాట్లాడుతూ చాలా మంది చిన్నపిల్లలు మరియు యవ్వనస్థులు సెల్ ఫోన్ కి, వీడియో గేమ్స్,ఫేస్బుక్ వాటికి అలవాట్లకు బానిసై తల్లిదండ్రులు మీద తిరుగుబాటు అవ్వుతూ, చదువు మీద ఏకగ్రత లేక పోవడం, వారు మానసికంగా ఎవరితో కలవకుండా ఒంటరిగా జీవించడం జరుగుతుందని, ఈ వేసవి సెలవుల్లో కూడా చిన్ని పిల్లలు సెల్ ఫోన్ కి ఎక్కువ సమయం గడుపుతు వుంటారన్నారు. అందుకే చిన్న పిల్లలుకు మరియు యవ్వనస్థులకు డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా టీచర్స్ కి చైల్డ్ సైకాలజీ, మోటివేషన్ సాంగ్స్, టీచింగ్ మెథేడ్స్ మొదలగు వాటిపై సేవాభారత్ టీమ్ నానాజీ, బి.నానిబాబు మరియు కె.ఎలీషా నేర్పించడం జరిగింద న్నారు., ఈకార్యక్రమానికి బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ కె.ఎలీషా స్పాన్సర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం కె.రాణి ఓఫీర్ చేతులు మీదుగా టీచర్స్ కి సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి.సి.పి.డబ్ల్యూ.ఎ.సెక్రటరీ. పి.సోంబాబు, యల్ల అనిల్ కుమార్, వి. స్టాలిన్, టి.బ్యూలాగ్రేస్, కె.నిస్సీ, శంఖవరం, చేబ్రోలు, నాగులపల్లి, కుమారపురం, పిఠాపురం తదితర ప్రాంతాల నుండి టీచర్స్ పాల్గొన్నారు.
