Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా పేదోడి సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్లుకి ఇసుక ఉచితంగా ఇస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా ఎస్పి నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఇసుక విధానంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్ట విరుద్దంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. పోలీస్ వారు అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు గుర్తిస్తే సంబంధిత తహసీల్దార్ కి అప్పగించాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాలు కలెక్టర్ అనుమతి లేనిదే తహసీల్దార్ లు విడుదల చేయరాదని ఆదేశించారు.

 

తహసీల్దార్ లు జారీ చేసిన వె బిల్లులో సమయం, వాహనం నెంబర్, ఫోన్ నెంబర్, ఎక్కడ నుండి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నారో అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని తెలిపారు. ప్రతి తహసీల్దార్, ఆర్ డి ఓ కార్యాలయం లో ఒక అధికారిని నియమించి ప్రతి వారం ఎన్ని అనుమతులు ఇచ్చారో సి సెక్షన్ కి నివేదిక సమర్పించాలని తెలిపారు.

 

ప్రస్తుతం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకి, నీటి పారుదల శాఖ కి మాత్రమే ఇసుక ఉచితంగా ఇస్తామని తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇతర జిల్లాలకి ఇసుక తరలిస్తే వారి వాహనాలను బ్లాక్ చేయాలని తహసీల్దార్ లకి సూచించారు.ఇసుక లభ్యం అవుతున్న మండలంలో తహసీల్దార్ లు, ఎస్ ఐ లు నిఘా పెంచి అక్రమ రవాణా నిర్ములించాలని, ఇసుక తరలించకుండా ఆ ప్రదేశం లో తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మొదటి సారి అక్రమ రవాణా లో వాహనం పట్టుపడితే కలెక్టర్ అనుమతితో 5000 జరిమాన, 1 లక్ష బైండొవర్ విధించి వదిలి పెట్టాలని, రెండవసారి పట్టుపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.

 

మన ఇసుక- వాహనం గుర్తించేందుకు ప్రత్యేకమైన రేడియం స్టికర్ రూపొధించి అతికించాలని అన్నారు.సాండ్ టాక్స్ గ్రూప్ లో ఏమైనా అనుమతులు ఇచ్చిన, అక్రమ వాహనాలు పట్టుపడిన తెలియపర్చాలని సూచించారు.

వరదల వల్ల పట్టా భూములలో ఇసుక మేట పెట్టిన ఆర్ డి ఓ అనుమతితో మాత్రమే ఇసుక తరలించుకోవాలని సూచించారు.

 

తదుపరి జిల్లా ఎస్పి నరసింహ మాట్లాడుతూ అక్రమ రవాణలో ఏమైనా వాహనాలు పట్టుపడితే గతంలో ఏమైనా కేసు లు ఉన్నాయా లెవా పరిశీలించి వారి వివరాలని తహసీల్దార్ కి అప్పగించాలని ఎస్ ఐ లకి సూచించారు. జాజిరెడ్డిగూడెం ఇసుక రిచ్ నుండి మాత్రమే ఇరిగేషన్ శాఖ కి అనుమతి ఉందని మిగిలిన ఎక్కడ లారీలకి ఇసుక తరలించేందుకు అనుమతి లేదని, జిల్లా సరిహద్దులలో తహసీల్దార్ లతో కలిసి పోలీస్ శాఖ అధికారులు ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలని సూచించారు.సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉండేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు

 

ఈ సమావేశం లో ఆర్ డి ఓ వేణుమాధవరావు, మైనింగ్ ఎం డి,జియాలజీఅధికారులు

. టి జి యం ఐ డి సి అధికారులు, సి సెక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాసరాజు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

ఐఏఎల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs

ఎమ్మెల్యే సహకారంతో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

TNR NEWS

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

TNR NEWS

ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు……….  కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు…..  ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……

TNR NEWS