మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు, ఇంగ్లీష్, గణితములో విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు భరత్ బాబు, లక్ష్మీ పాల్గొన్నారు.

next post