- కోదాడ పట్టణంలోని బొడ్రాయీ బజారులో ఉన్న శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయం ఆరవ వార్షికోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపి ప్రత్యేక పూలతో అందంగా అలంకరించారు. పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కరుణాకటాక్షంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున: ప్రతిష్ట కమిటీ, రైతు కమిటీ, ముత్యాలమ్మ కమిటీ సభ్యులు ఆవుల. రామారావు,సట్టు. నాగేశ్వరరావు, మేళ్లచెరువు. కోటేశ్వరరావు, వి రవీందర్ రెడ్డి, పైడిమర్రి వెంకటనారాయణ, పైడిమర్రి. నారాయణరావు, తోట. శ్రీను,గంధం. రంగయ్య,పందిరి. సత్యనారాయణ, అబ్బాయి రాముడు, కోట వెంకటేశ్వరరావు, గంధం పాండు, ఆలేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు………..

previous post