Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

  • ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం

 

మంగళగిరి : అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత బలయిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్. చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు. పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోవడం, ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయిన విషయాలు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయి. క్షేత్ర స్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్నీ తెలియచేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాన్ని సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్ళు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు.

 

Related posts

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం

Dr Suneelkumar Yandra

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

Dr Suneelkumar Yandra

వజ్రకవచధర గోవింద గోవింద

Dr Suneelkumar Yandra

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం