Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పోరేటర్లు

  • పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక

 

విశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, గాజువాక 74వ డివిజన్ కార్పోరేటర్ తిప్పల వంశీరెడ్డి, గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకులు ఆళ్ల శివ గణేష్ తోపాటు వారి అనుచరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు కుంచె జ్యోత్స్న, బెహరా, స్వర్ణలత, శివదేవి జనసేనలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంగ దుర్గా ప్రశాంతి పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రస్థాయి వేదిక అవార్డు అందుకున్న16 మంది వివిఎస్ స్కూల్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

నల్లమల అడవుల్లో ప్రసిద్ధిచెందిన.. కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలి

Dr Suneelkumar Yandra

రేపు విద్యుత్ అంతరాయం* 

TNR NEWS

నీ ఆలోచనే – నీ విజయం

Dr Suneelkumar Yandra

అలరించిన శ్రీ కృష్ణుడి లీలలు – అభినందించిన డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్‌  – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన

TNR NEWS