Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో గుంజేడు దేవాలయ అవరణం కోలాహలంగా మారింది. ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో 2006-07 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది.ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు గుంజేడు దేవాలయ ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

TNR NEWS

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

యోగ మనిషి జీవనంలో మార్పు తెస్తుంది…సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్.

Harish Hs

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs