ఖమ్మం : కార్పొరేషన్ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో పెయింటర్ అక్కినపల్లి రమేష్ గత 20 సంవత్సరాలుగా పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతూ టూవీలర్ మెకానిక్ యూనియన్ అనుసంధానంగా ఉన్నటువంటి అక్కినపల్లి రమేష్ గత 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చేయికి ప్యాచర్ అయినది డాక్టర్ల సూచనలు మేరకు దాదాపుగా నెలరోజులు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పినారు నాకు యూనియన్ తరపున నాకు సహాయం అందించగలరని ఖమ్మం కార్పొరేషన్ టూవీలర్ మెకానిక్ యూనియన్ దృష్టికి తీసుకురాగా యూనియన్ స్పందించి వెంటనే అక్కినపల్లి రమేష్ కి యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు మరియు యూనియన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి పదివేల రూపాయలు చెక్కును రమేష్ అందించడం జరిగింది. యూనియన్ తరపున 10000 చెక్కు అందించినటువంటి యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపినారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వంగాల కొండలరావు మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో యూనియన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మెకానికల్ కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. టూవీలర్ మెకానిక్ యూనియన్ ఉండటం వలన మెకానికులకు ఎలాంటి ఆపద వచ్చినా యూనియన్ అండగా ఉంటుందని యూనియన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు అదేవిధంగా యూనియన్ లో లేనివారు కూడా సభ్యత్వం తీసుకొని యూనియన్ నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మెకానిక్ సోదరులు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా ప్రతి కమిటీ సభ్యుడు మరియు మెకానిక్ సోదరులు యూనియన్ లో లేని వారిని కూడా యూనియన్ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రతి ఒక్క మెకానిక్ తో మాట్లాడి యూనియన్ వల్ల ఏమిటి లాభాలు ప్రతి ఒక్క మెకానిక్ మరియు యూనియన్ కమిటీ సభ్యులు తెలియజేయవలసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ అన్వర్ లింగన్న బోయిన మురళి భైరోజు శేషు దుంపల నాగరాజు ఎమ్మెల్సీ నాగులు మీరా షేక్ సుభాని నరేందర్ పాల్గొన్నారు