శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని *కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్* అన్నారు. శుక్రవారం అత్యంత మాహిమాన్వితమై, అనుకున్న కోరికలు తీర్చే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి సందర్భంగా మోతే మండలం కూడలి గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు స్వామి వారి అభిషేక, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని,అలాగే ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ…కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఉన్న ఇబ్బందులు అన్ని తొలగి, వారు సుఖ, సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని శ్రీ సంగమేశ్వర స్వామిని కోరారు.. భక్తులకు మాజీ ఎమ్మెల్యే కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవాలయాలన్నీ హర హర మహాదేవ శంభో శంకర అనే కీర్తనలతో మార్మోగి పోతున్నాయన్నారు. వేదమంత్రాలతో ఆలయ అర్చకులు హరి ప్రసాద్ గారు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు పొనుగోటి నరసింహారావు, సర్వారం సొసైటీ వైస్ చైర్మన్ పల్స్ మన్సూర్, మాజీ సర్పంచులు కోటేష్, సంగెం లింగయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు వీరు నాయక్, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post