ఉద్యోగ విరమణ పొంది ఏడాది కాలం పూర్తి అయిన నేటి వరకు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయకపోవడం బాధాకరమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి చుండూరు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కోదాడ ఎస్ టి ఓ కార్యాలయం ఆవరణము నందు నిరసన తెలిపి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసి కుటుంబ బాధ్యతలు, అనారోగ్యాలతో బాధపడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కాగా ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి మంజూరు చేయకుండా ఇటీవల రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ సంఘ నాయకులమని చెప్పుకునే వారు మరికొందరు దొడ్డి దారిన పైరవీల ద్వారా బెనిఫిట్స్ అన్ని మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. అక్రమంగా బెనిఫిట్స్ మంజూరు చేసిన అధికారులను ఈ కుబేర్ నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పైరవీల ద్వారా అక్రమంగా లబ్ధి పొందిన వారి నుండి రికవరీ చేసి సీనియారిటీ ప్రాతిపదికన బెనిఫిట్స్ అందించాలని సంఘ పక్షాన ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ టి ఓ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో టాప్రా సంఘం కోదాడ డివిజన్ అధ్యక్షులు శివరామయ్య, రిటైర్డ్ ఉద్యోగులు గోవిందరావు, మేకల సుధాకర్ రావు, తెల్లాకుల నాగేశ్వరరావు, కే గోపి,సిరంగి నరసింహారావు, కే కృష్ణవేణి, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు భిక్షం తదితరులు పాల్గొన్నారు……..