Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతు భరోసా, బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి

వేసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం కోదాడ పట్టణంలో ఆర్డీవో సూర్యనారాయణ ను రైతులతో కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలైన కోదాడ, కొమరబండ, తమ్మర, గుడిబండ,తొగర్రాయి, గణపవరం, కూచిపూడి గ్రామాలలో కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 2 కోట్ల 25 లక్షల రూపాయలు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు కావస్తున్న నేటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదు అన్నారు. వానాకాలం సీజన్ లో కూడా రైతు భరోసా రాని రైతులు ఉన్నారని ఇప్పటివరకు మూడున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారని రైతులందరికీ బోనస్ తో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కనగాల కొండయ్య, మునగా రాంప్రసాద్, కొండ సురేష్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు………

 

Related posts

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

TNR NEWS

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Harish Hs

ఎండలు పెరుగుతాయ్జా గ్రత్తగా ఉండాలి

TNR NEWS

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs

టి ఆర్ నగర్ లో ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు. – వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

TNR NEWS