Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. గురువారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వందరోజుల ప్రణాళిక అమలులో భాగంగా పట్టణంలోని 14 వ వార్డు శ్రీరామ నగర్ లో ఉమెన్ ఫర్ ట్రీ వనమహోత్సవం కార్యక్రమంలో మహిళలకు మొక్కలను పంపిణీ చేసి అనంతరం నాటి మాట్లాడారు.భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం వార్డులో డ్రైనేజీల వద్ద దోమల మందును పిచికారి చేయించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను ప్రారంభించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సాయి లక్ష్మి, ఏ ఈ అంజలి, ఎస్సై సురేష్, ఈఈ భవాని, వెంకన్న, వార్డు ప్రజలు బొలిశెట్టి కృష్ణయ్య, నాగమల్లేశ్వరి, ఆర్పి మమత వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..

Related posts

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

TNR NEWS

కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

TNR NEWS

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం – ఎన్ సీ సంతోష్ 

TNR NEWS

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతే కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

TNR NEWS

నేడు జాతీయ బాలిక దినోత్సవం

TNR NEWS