జనరల్ బాడీ తీర్మానం మేరకే పబ్లిక్ క్లబ్ కొత్త భవనం బహిరంగ వేలం నిర్ణయం తీసుకున్నామని కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి బొల్లు రాంబాబు అన్నారు. శనివారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవనం బహిరంగ వేలం పై కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని వారి ఆరోపణలు ఖండించారు. భవనం అమ్మకానికి సంబంధించి అన్ని సామాజిక వర్గాలతో కూడిన కమిటీని వేయడం జరిగిందన్నారు. ఒక సామాజిక వర్గం వారికి భవనం కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందనేది అవాస్తవం అని బహిరంగ వేలంలో ఎవరు ఎక్కువ చెల్లిస్తే నిబంధనల ప్రకారం కమిటీ వారికి అప్పగిస్తుంది అన్నారు. చట్ట పరిధికి లోబడి క్లబ్ భవనం అమ్మకం కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అమెరికాలో ఉన్న వారి సంప్రదింపులతోనే బహిరంగ వేలం ప్రక్రియ జరుగుతుంది అన్నారు. పాలకవర్గం అమ్మకం కమిటీల నిర్ణయం మేరకు నేడు ఆదివారం ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ వేలంలో నిబంధనల ప్రకారం ఎవరైనా పాల్గొనవచ్చు అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సెక్రటరీ చింతలపాటి శేఖర్, కార్యవర్గ సభ్యులు గుండపునేని వేణు తదితరులు పాల్గొన్నారు………