Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

మునగాల మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సత్యమ్మ గుడి వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగాఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్రనాయకులు మునగాల మండలఇంచార్జ్ వడ్డేపల్లి కోటేష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్సీ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జులై 7.న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మునగాల మండలంలోని ప్రతి గ్రామంలో నిర్వహించాలని

ప్రతి గ్రామంలో జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలని

 తెలియజేశారు. మాదిగల దైవం *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ* తన జీవితాన్ని మాదిగ సమాజం కోసం అంకితం చేసాడని, ప్రతి సంక్షేమ పథకం లో మందకృష్ణ మాదిగ పోరాటం ఉందని తెలిపారు.మాదిగ జాతి కోసం పోరాడుతూనే సమాజంలో సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడిన వ్యక్తికి పద్మశ్రీ రావడం ఎంతో సంతోషాదయకమని,ఆ పద్మశ్రీ పేద వర్గాలకు వచ్చిందని, జాతి కోసం చేసిన పోరాటాన్ని గ్రామాలలో తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డకు ఉందని, దాంట్లో భాగంగా LED స్క్రీన్ లు ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని చూపించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షుడు లంజపల్లి శ్రీను మాదిగ, మాజీ ఉపసర్పంచ్ లంజపల్లి వెంకయ్య,లంజపల్లి సత్యం, ఇట్టికాల వెంకన్న,ఇటికాల వెంకటరాములు, జిల్లాపల్లి పిచ్చయ్య, లంజపల్లి లాజర్,జిల్లా తిరపయ్య, లంజపల్లి రఘునాథం, మునగాల మండల మాదిగ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న 4గురు దొంగలు అరెస్ట్

Harish Hs

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

TNR NEWS

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం నెల రోజులు అయినా నిలవని ఆనందం

TNR NEWS

సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి

TNR NEWS

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS