Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

యోగా జీవితంలో ఒక భాగం కావాలి

ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని యోగా గురువు వేనేపల్లి ప్రసాద్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.నేటి పోటీ ప్రపంచంలో ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఒత్తిడిని అధిగమించడానికి,శారీరక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతిరోజు ఒక గంట యోగాకు కేటాయిస్తే శారీరక,మానసిక ఆందోళనలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.అనంతరం యోగా గురువు వివిధ ఆసనాలు చేపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బొల్లు రాంబాబు, కాంపాటి నరసయ్య, పందిరి రఘు వర ప్రసాద్, భ్రమరాంబ, మంగతాయారు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు………..

Related posts

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

TNR NEWS

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

Harish Hs

కోదాడ పట్టణంలో భారీ వర్షం వీధులన్నీ జలమయం

TNR NEWS

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS