యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో నాగార్జున లాడ్జ్ కాంప్లెక్స్ లో శ్రీ వెంకటేశ్వర హోటల్ ను ప్రారంభించి మాట్లాడారు. హోటల్ యజమానులు స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించి వారికి జీవన భృతి కల్పించాలన్నారు. వ్యాపార వాణిజ్య రంగాల అభివృద్ధితో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. శ్రీ వెంకటేశ్వర హోటల్ వినియోగదారులకు రుచికరమైన పలహారాలు తినుబండారాలు అందజేసి పేరు గడించాలన్నారు. నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, నాయకులు ముత్తవరపు పాండురంగారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారావు మాజీ కౌన్సిలర్ కమదన చందర్ రావు హోటల్ నిర్వాహకులు గుండపునేని వేణుగోపాలరావు, గుండపునేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…….