నిత్య జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని పట్టణ ప్రముఖ వైద్యులు,సన్రైజ్ వెస్ట్ జోన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎటుపూరి రామారావు తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బైపాస్ గ్రౌండ్ నందు వైద్యులతో కలిసి యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అనేక దీర్ఘకాలిక వ్యాధులనుండి బయటపడతామని ఒత్తిడిని జయించి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు మేకల రాజారావు 25 రకాల యోగాసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ఇఎన్టి ప్రసాద్, కొత్త మాసు జనార్దన్, అంకతి మధుసూదన్, షాకీర్ పాషా, రిటైర్డ్ టీచర్ సట్టు నాగేశ్వరరావు, వీరయ్య, గద్దె రఘు, జనపనేని కృష్ణ, వేమూరి సురేష్, గద్దె వెంకటేశ్వరరావు, అనురాధ, లావణ్య, మీనాక్షి, మేకల రాజారావు, షేక్ రహీం, పత్తిపాక జనార్ధన్, కట్ట సతీష్, గురు స్వామి, రంగాచారి తదితరులు పాల్గొన్నారు………