Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి. – సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్

సూర్యాపేట: ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలుచుకొని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప్రైవేట్ పాఠశాలలు మోపుతున్నాయని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పట్టణ పార్టీ కార్యాలయంలో జరిగిన వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూప్రవేట్ కార్పోరేట్ పాఠశాలలు అనేక కోచింగ్ సెంటర్ల పేరుతోటి నవోదయ గురుకులం సైనిక్ పేర్లతోటి ఓలంపియాడ్, ఐపీఎల్, గ్లోబల్, IPL. ఇంటర్నేషనల్ సీబీఎస్సీ గ్లోబల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో మాయ చేస్తూ, యూకేజీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల నుంచి పుస్తకాలు, టై,బెల్ట్‌లు, డ్రెస్‌లు, మరెన్నో పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. కొంతమంది యాజమానులు డొనేషన్ పేరిట నర్సరీ నుండి పదో తరగతి వరకు రూ.1,50,000 వరకు వసూలు చేస్తున్నారని, ఇది తల్లిదండ్రులపై తీవ్ర భారం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్య హక్కు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉచితంగా కనీసం 25% సీట్లు ఇవ్వాల్సిన నిబంధనను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.జిల్లా విద్యా అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై తక్షణమే స్పందించి సంబంధిత యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు మామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య, కప్పల సత్యం, మాధగోని మల్లేష్, ఒట్టే ఎర్రయ్య, శశిరేఖ, జయమ్మ, పిట్టల రాణి పాల్గొన్నారు.

Related posts

ఓపెన్ ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ చేయదలచే విద్యార్థులకు మరో అవకాశం –  కోఆర్డినేటర్ దాసు

TNR NEWS

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

TNR NEWS

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

TNR NEWS

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం*

TNR NEWS