Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్ లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని గుడు గుండ్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరావు సంతాప సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి నిజాయితీలు కరువైన ఈ రోజుల్లో గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేశారని రైతుల కోసం సమాజ కోసం ఇంకా ఎంతో సేవ చేయాల్సి ఉన్న హనుమంతరావు మన మధ్యన లేకపోవడం బాధాకరం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం అన్నారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మాజీ సర్పంచులు పార సీతయ్య, ఎర్నేని బాబు,తొండపు సతీష్, నంబూరి సూర్యం, మల్లెల రాణి, డాక్టర్ సుబ్బారావు, రామారావు, ఓరుగంటి ప్రభాకర్, ముత్తినేని సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు కనకమ్మ, ఉన్నం శ్రీనివాసరావు, లత, శ్రీ లక్ష్మీ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు……….

Related posts

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

TNR NEWS

మంత్రి పిఎ శ్రీధర్‌ రిసెప్షన్‌ కు హాజరైన మంత్రి దామోదర్‌ 

TNR NEWS

గురుకుల హాస్టల్ లల్లో విద్యార్థుల మరణాలపైన వారి సమస్యలపైన హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్

TNR NEWS