Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపర్ ఇంటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు రూట్ ఆఫీసర్లు కు రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డా. వెంకటేశులుతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. ఈనెల 17 ,18 తేదీలలో నిర్వహించే గ్రూప్ III పరీక్షకు సూర్యాపేటలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలు ఉండగా 8951 విద్యార్థులు పరీక్ష కు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రానికి అనుమతించేటప్పుడు విద్యార్థుల హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డును తనిఖీ చేసి పంపాలని పేర్కొన్నారు . మొత్తం 68 బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ను అందుబాటులో ఉంచామని ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఫర్నిచర్ ,త్రాగునీరు మెడికల్ కిట్ అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి లేదని అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుర్తు చేశారు.

Related posts

కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష 

TNR NEWS

యోగా జీవితంలో ఒక భాగం కావాలి

Harish Hs

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 31వఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

TNR NEWS

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను తక్షణమే విరమించుకోవాలి: ఎం సాయిబాబా

TNR NEWS

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం

TNR NEWS