జులై 14 నుంచి చేపట్టే ఆర్టిజన్ల సమ్మెను విజయవంతం చేయాలని టీవీ ఏసి జేఏసీ జిల్లా కన్వీనర్ కొండ నకులుడు పిలుపునిచ్చారు. నిరవధిక సమ్మె గోడ పత్రికను టీవీ ఏసి జెఎసి సూర్యాపేట జిల్లా కోదాడ లో ఆవిష్కరించి మాట్లాడారు. యూనియన్ల కు సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు యూనియన్ల కు అతీతంగా జూలై 14 వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలాగే ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. స్టాండింగ్ ఆర్డర్స్ ను రద్దుచేసి ఏపీ ఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్వర్షన్ అనేది ఉద్యోగ భద్రత, ఆత్మ గౌరవనికి సంబంధించిన అత్యంత కీలకమైన డిమాండ్ అని పేర్కొంటూ జూలై 14 తేదీ నుండి విధులను బహిష్కరించి ముక్తకంఠంతో సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. నాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టిజన్ అనే ఒక ముద్దు పేరు పెట్టి కార్మికులను నట్టేట ముంచారని వాపోయారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్ఛారని ఇంతవరకు అతిగతి లేదని విమర్శించారు. ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేసి మా ఇంటిలో ద్వీపం వెలిగిస్తారని లేనిపక్షంలో నిరవధిక సమ్మె ఎంత వరకైనా సిద్ధమే అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం హుజూర్నగర్ డివిజన్ కన్వీనర్ పబ్బు మల్లయ్య వైస్ చైర్మన్ విడతల శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు సిహెచ్ రామచంద్రు మునగాల సెక్షన్ లీడర్ బత్తిని రామారావు నడిగూడెం సెక్షన్ లీడర్ సాయి చందు సైదిరెడ్డి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

previous post