Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్ – II ఇన్చార్జి ఐజిపి తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్,గౌరవ వందనంతో స్వాగతం తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. సమావేశంలో పోలీసు అధికారులకు సూచనలు చేసిన శ్రీ.తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్, డీఐజీ VI జోన్ చార్మినార్ జోన్, ఇంచార్జీ IGP మల్టీ జోన్-2. జిల్లాల సందర్శనలో భాగంగా బుధవారం మల్టీజోన్ టు ఇన్చార్జి ఐజిపి శ్రీ తప్సీర్ ఇక్బాల్ ఐపిఎస్ సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీసు గౌరవ వందనంతో స్వాగతం తెలిపి పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగినది. అనంతరం సమావేశ మందిరం నందు ఎస్పీ తో కలిసి సిఐలు డీఎస్పీల తో సమావేశం నిర్వహించారు.ముందుగా జిల్లా భౌగోళిక పరిస్థితులు, జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రాంతాలు, ప్రముఖ వృత్తులు, జనాభా, రాజకీయ పరిస్థితులు, ఈ సంవత్సరంలో నమోదైన నేరాలు వాటి తీరుతెన్నులు, నేరాల నివారణలో జిల్లా పోలీసు ప్రణాళిక, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపటానికి తీసుకోబోతున్న చర్యలు, పోలీసు ప్రజా భరోసా, ప్రజా అవగాహన చైతన్య కార్యక్రమాలు, కళాబృందం, షీ టీమ్స్, భరోసా టీమ్స్ మొదలగు అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఇన్చార్జ్ ఐజిపి గారికి వివరించడం జరిగినది. కేసుల నమోదు, ఫిర్యాదుల నిర్వహణ, పోలీస్ ప్రజా భరోసా, పబ్లిక్ ఫీడ్ బ్యాక్, కోర్టు మానిటరింగ్, డయల్ 100 స్పందన, ఎన్ఫోర్స్మెంట్, ప్రజా అవగాహన కార్యక్రమాలు, పోలీసు పని తీరు, కేసు దర్యాప్తు, నైపుణ్యాల ను ఇన్చార్జి ఐజిపీ గారు పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా తఫ్సీర్ ఇక్బాల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ నేరాల నివారణలో ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, కేసుల దర్యాప్తులో నైపుణ్యం చూపాలని ఆదేశించారు. నేరాల నివారణకు ముందస్తుగా పని చేయాలి, క్షేత్ర స్థాయిలో సంచారం సేకరించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో నిర్వహించడానికి సిద్దంగా ఉండాలి అని అన్నారు, సమస్యాత్మక విషయాలపై దృష్టి పెట్టాలి, గ్రామ పోలీసు అధికారిని యాక్టీవ్ చేసి గ్రామాల్లో సమస్యలపై దృష్టి పెట్టాలి. చిన్న సమస్యలు కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యగా మారుతాయి ఇలాంటి వాటిని ఆదిలోనే పరిష్కరించాలి అన్నారు. ఎన్నికల సమయంలో గతంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది పరిశీలించుకుని పని చేయాలి. ప్రతి అంశంపై నిశిత పరిశీలన పెట్టాలి అని ఆదేశించారు. భౌతిక దాడుల జరగకుండా చూడాలి. పాత నేరస్తులు సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులు రౌడీలు కేడీలను ముందస్తుగా బైండోవర్ చేయాలి, పాత నేరస్తులను, ట్రబుల్ మాంగర్స్ ను చెచ్చరించాలి అన్నారు. దొంగతనం ద్వారా పోయే డబ్బు కన్న సైబర్ మోసం ద్వారా పోయే డబ్బు ఎక్కువగా ఉంటుంది కొత్త తరహాలో నేరాలు జారుతున్నాయి, పోలీసులు కూడా కొత్త తరహాలో అలొసుచి నేరాలు జరగకుండా ప్రజలకు, విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి, ప్రజలతో మర్యాదగా మసులుకోవలి. సూర్యాపేట చాలా ప్రశాంతత కలిగిన జిల్లా, అక్రమ కార్యకలాపాల పై కటినంగా పని చేయాలి అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల ను చైతన్య పరిచి రక్షణ కల్పించాలి. డ్రగ్స్ లాంటి వ్యసనాలకు లోనూ కాకుండా నిఘా ఉంచాలి, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ జరగకుండా విద్యాసంస్థల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. పిల్లల అక్రమ రవాణా జరగకుండా చూడాలి, బాలకార్మిక వ్యవస్థ ను సమూలంగా నిర్మూలించాలి, జిల్లా యంత్రాంగం వారితో సమన్వయంగా పని చేయాలి అని కోరారు.

 

అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ ఆదేశాలను జిల్లాలో అమలు చేస్తామని ప్రోయాక్టివ్ గా పని చేస్తూ నేరాలను నివారించడంలో బాగా కృషి చేస్తామని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పటిష్టంగా పనిచేసే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. 

 

ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, AR అధనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, కోదాడ డివిజన్ DSP శ్రీధర్ రెడ్డి, AR DSP నరసింహ చారి, AO మంజు భార్గవి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, వెంకటయ్య, నరసింహారావు, నాగేశ్వరరావు, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, రజిత రెడ్డి, IT కోర్ RSI రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు

Related posts

వీరాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ 

TNR NEWS

విద్యా హక్కు చట్టం అమలు చేయండి – సమాచార హక్కు చట్టం సాధన కమిటీ – వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్

TNR NEWS

యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మజాహర్

TNR NEWS

గ్రాండ్ టెస్ట్ విజేతలకు నేడు బహుమతుల ప్రధానోత్సవం

Harish Hs

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో  25 మంది లబ్ధిదారులకు. చెక్కుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

TNR NEWS

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS