Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అధ్వర్యంలో షీ టీమ్ సిబ్బంది చిలుకూరు మండల కేంద్రంలో గల MITS కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భగా కోదాడ షీ టీమ్ ఎస్ ఐ మాధురి మాట్లాడుతూ.. విద్యార్థులకు షీ టీమ్ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది, అది వారికి ఎలా ఉపయోగపడుతుంది, ఈవ్ టీజింగ్,సోషల్ మీడియాలో వేధింపులను గురించి, మహిళల అక్రమ రవాణా, బాలల దుర్వినియోగం, బాల్య వివాహాలు,బాల కార్మికులు, చైల్డ్ లైన్ 1098, బోండెడ్ లేబర్, పోస్కో చట్టం గురించి, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, యాంటీ-ర్యాగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, సైబర్ క్రైమ్, ఎక్కడైనా సమస్యలు ఉంటే అత్యవసరంగా సంప్రదించదానికి *100 డయల్* మరియు షీటీమ్ నంబర్ 8712686056 గురించి అవగాహన కల్పించడం జరిగింది. *షీ టీమ్స్* మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇది ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై ప్రత్యేక దృష్టి సారిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో షి టీమ్ మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి , పాఠశాల ఉపాధ్యాయనిలు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు…

 

Related posts

కోదాడ లో ఘనంగా రంజాన్ వేడుకలు

TNR NEWS

జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

Harish Hs

సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం కోలాటాలు నృత్యంతో నిరసన సీఎం హామీ నిలబెట్టుకోవాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ

TNR NEWS

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS