మాల్యల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం మండల బిఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి, సట్స్ పంచి, టపాసులు పెల్చి ఘనంగా నిర్వహించారు. మండలము లోని అన్ని గ్రామాల్లో నుండి కేటీఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జనగం శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడే క్రమంలో కొండగట్టు అంజన్న భగవంతుడు అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్,సింగిల్ విండో చైర్మన్ మధుసూదనారావు,మండల కో అప్షన్ అజారుద్దీన్,
సర్పంచ్ లు ఎడిపెళ్లి అశోక్, గడ్డం మల్లారెడ్డి, రౌతు రవి, ఎంపీటీసీ దేవరాజం, మాజీ ఎంపీపీ శ్రీలత, మాజీ గడ్డం రాజేశం, సింగిల్ విండో చైర్మన్ అడువల సురేష్, సాంగ సత్తన్న, దొంతరపు శేఖర్, చిన్న దుర్గయ్య, స్వామి గౌడ్, పోచమ్మల త్రినాధ్, ప్రవీణ్, కొంక నరసయ్య, బాలే సంజీవ్, దశరథం, టి రాజేందర్, కోరుట్ల రవీందర్,రియాజ్, అనిల్ రెడ్డి, అమీర్, సత్య రెడ్డి,మిల్కురి మల్లారెడ్డి,గుర్రం మల్లేశం, దూడ సురేష్, జేఎస్ గౌడ్,చంద్రయ్య, శ్రీనివాస్,నగేష్,తిరుపతి గౌడ్, రమేష్, పోచంపెళ్లి,రాజమల్లు,గుడిసె రవి, కాంతయ్య, చందు, అరుణ్, సుద్దాల నరశయ్య తదితరులు పాల్గొన్నారు.