- దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండల పరిధిలోని తాడ్వాయి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కలకోవ రోడ్డు ప్రైవేట్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాడ్వాయి గ్రామానికి చెందిన చిర్ర సైదులు పొలంలో పండిన వడ్లను ట్రాక్టర్లో తరలించి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ట్రాక్టర్ హైడ్రాలిక్ లేపుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగ తగిలి చిర్రా సైదులు (50) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
previous post