మునగాల మండలం భరాఖత్ గూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పై అవగాహన కలిగి ఉండాలని తలపెట్టిన మండలం లోని అన్ని ప్రభుత్య పాఠశాలకు భారత రాజ్యాంగం బుక్స్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..భారత రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై జరుగుతున్న విషప్రచారాన్ని కట్టడి చేయాలంటే ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, అది విద్యార్థి దశనుండే మొదలవ్వాలి అనే లక్ష్యం తో, విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తో మండలం లోని జిల్లా పరిషత్ పాఠశాలకి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ ప్రతులని మొదటిగా మునగాల మండలం లో ప్రారంభించటం జరిగిందన్నారు.రాబోయే రోజులలో కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు లైబ్రరీ లకు రాజ్యాంగ ప్రతులని అందిస్తానని, గతంలో వివాహది శుభాకార్యాలలో 253 బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలు బహుమతులు ఇవ్వటం జరిగింది అని తెలియజేశారు.