సూర్యాపేట నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ పార్థసారధిని సూర్యాపేట సీఐ వీర రాఘవులు, ఎస్సైలు ఏడుకొండలు, సాయిరాం, సైదులు, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్ డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. బెట్టింగ్, పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుని.. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా ప్రజలు తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.