Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పాత నేరస్తులు, సస్పెక్ట్, అనమానితుల కదలికలపై నిఘా

సూర్యాపేట జిల్లాలో ప్రజలకు, ప్రజల ఆస్తులకు మెరుగైన రక్షణ,భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం స్కానర్ తో అనుమానితుల వేలిముద్రల సేకరించి తనిఖీలు చేయడం జరిగినది ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపినారు. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్, ఖమ్మం అండర్ పాస్, పిఎస్ఆర్ సెంటర్ చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్ చౌరస్తా, వాణిజ్య భవన్ సెంటర్, SV డిగ్రీ కాలేజ్ చౌరస్తా, అలాగే కోదాడ పట్టణంలో ముఖ్యమైన కూడల్లో అనేక ప్రదేశాలలో స్కానర్ తో అనుమానితులను తనిఖీలు చేయడం జరిగినది. కొత్త బస్టాండ్ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఈ తనిఖీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఆదేశాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మెరుగైన భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా కేంద్రంలో ఎవరైనా పాత నేరస్తులు, అనుమానితులు, ఇతర రాష్ట్రాల్లో నేరాల్లో ఉన్నవారు ఇలా ఎవరైనా సంచరిస్తున్నారా అనే కోణంలో తనిఖీలు చేశామని తెలిపారు. ఈ స్కానర్ నందు పాత నేరస్తుల వివరాలు వారి కేసుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి, డాటా బేస్ లో ఉన్న వేలిముద్రలతో ఎవరైనా అనుమానితుల వేలు ముద్రలు పోలితే వారి వివరాలు స్కానర్ నందు నమోదు అవుతాయి అని తెలిపారు. ఈ తనిఖీల ద్వారా ఎవరైనా అనుమానితులు, నేరస్తులు, దొంగలు సంచరిస్తే అలాంటి వారిని గుర్తించి వారు ఎక్కడెక్కడ నేరాలు పాల్పడ్డారు అనే వివరాలను తలఖీ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఎందుకు ఉన్నారు అని తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు.

 

ప్రజలు వ్యాపారస్తులు భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు పాటించాలని కోరారు. వ్యాపార సముదాయాలు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భారీ మొత్తంలో నగదు ఆభరణాలు ఉంటే అలారం సిస్టం ఏర్పాటు శ్రేయస్కరమని అన్నారు. ఏటీఎం సెంటర్స్, బ్యాంక్ సెక్టార్స్ వద్ద పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి, అత్యాధునిక సాంకేతికతతో కూడిన చాలా రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెట్రోల్ బంక్ లు, వైన్ షాప్స్, జ్యువలరీ షాప్స్, సూపర్ మార్కెట్స్, రెసిడెన్షియల్ జోన్స్, అపార్ట్మెంట్స్, హోటల్స్, లాడ్జ్, డాబాలు, హాస్పటల్, ఏజెన్సీల వద్ద వారి వ్యాపారాలు కవర్ అయ్యేలా, రోడ్లు కనిపించేలా అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దీని కోసం స్థానిక పోలీసుల సహకారం తీసుకోవచ్చని అన్నారు. గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డు నిర్ధారణ లేకుండా ఆశ్రయం కల్పించవద్దని నివాసాలు అద్దెకు ఇవ్వకూడదని ఎస్పీ గారు అన్నారు. ఆశ్రయం కల్పించే వ్యక్తుల యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇతర గుర్తింపు కార్డులను తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు అపరిచితులు అనుమానితులు ఎవరన్నా వచ్చినట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. లాడ్జిలో, హోటల్స్ నందు వచ్చే వ్యక్తుల యొక్క వివరాలు తప్పనిసరిగా రికార్డులో నమోదు చేయాలని గుర్తింపు కార్డులను తీసుకోవాలని ఆదేశించారు. అనుమానితులు కొత్త వ్యక్తుల సమాచారాన్ని మరియు స్థానికంగా ఏవైనా గొడవలు కొట్లాటలు లాంటి సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలి అని, ప్రతి పౌరుడు సమాజ రక్షణలో, నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఎస్పీ గారు కోరారు

 

ఎస్పి వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, స్థానిక CI వెంకటయ్య, SI లు, సిబ్బంది ఉన్నారు.

Related posts

అఖిలపక్ష సమావేశం

Harish Hs

TNR NEWS

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

TNR NEWS

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

TNR NEWS

చేర్యాల ప్రాంత రైతాంగానికి కాంగ్రెస్ ముసుగులో ఉన్న జేఏసీ నాయకులు క్షమాపణ చెప్పాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి

TNR NEWS

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.

Harish Hs