శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించారు.కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గల జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గోవిందమాంబ, సరస్వతీ, శివ పార్వతి అమ్మవార్లకు చీర, సారె ఒడి బియ్యం కార్యక్రమాలను మహిళా భక్తులు రామిశెట్టి కృష్ణవేణి, రావూరి భవానిల ఆధ్వర్యంలో కనుల పండువగ నిర్వహించారు. అమ్మవార్లను తీరోక్క పూలతో అందంగా అలంకరించి భక్తులు పల్లకి సేవను అత్యంత వైభవోపేతంగా జరిపారు. అమ్మవార్ల కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకురి అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, రామిశెట్టి కృష్ణవేణి, రావూరి భవాని,విజయ, మాధవి, శిరీష, ఉదయలక్ష్మి, సుభాషిని, శారద,శ్రీదేవి,రంగమ్మ,పద్మా, లక్ష్మి, కృష్ణమూర్తి, బ్యాటరీ చారి, పుల్లారావు, బి ఎల్ ఎన్ రెడ్డి, మట్టయ్య, ఆలయ అర్చకులు వెంకటకృష్ణ, విశాల్, మిశ్రా, రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు……